Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 8:05 pm Posted by : ramakrishna

సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ గితేను కలిసిన జర్నలిస్టులు

 

సిరిసిల్లా, బతుకమ్మ :

 

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులపై కేసుల నమోదు విషయమై గురువారం ఎస్పి మహేష్ గీతేని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులపై కేసులు నమోదు చేసే ముందు తప్పకుండా జర్నలిస్ట్ సంఘాలను ప్రెస్ క్లబ్ బాధ్యులను సీనియర్ జర్నలిస్టులను సంప్రదించాలని అక్రమ వ్యవహారాలలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయడానికి ఏ రకమైన అభ్యంతరం లేదని అయితే వృత్తిపరమైన వార్తలు రాసిన జర్నలిస్టులపై కక్షతో కేసులు నమోదు చేయవద్దని విన్నవించారు. ఇటీవల పోలీసులు జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులపై ఎస్పీ ని జోక్యం చేసుకొని వ్యక్తిగతంగా విచారణ జరిపి జర్నలిస్టులకు తగిన న్యాయం చేయాలని కోరారు. పోలీసులు జర్నలిస్టుల వ్యవహారంలో తగిన సహకారం అందించాలని పోలీసులు జర్నలిస్టులు కలిసి మెలిసి ఉండే కార్యక్రమాలు కొనసాగించాలని జర్నలిస్టులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించారు. నైతిక విలువలు పాటిస్తూ జర్నలిస్టులు వృత్తి ధర్మం నిర్వహించాలని కోరారు. కొంతమంది విలేకరులపై తప్పుడు కేసులు నమోదు చేసినట్లు మా దృష్టికి వచ్చిందని, దీనిని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగిందన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఆకుల జయంత్ కుమార్, ఆడెపు మహేందర్, బొడ్డు పరుశరాములు, సీనియర్ జర్నలిస్టులు కరుణాల భద్రాచలం, టివి నారాయణ, ఊరడి మల్లికార్జున్, రాచ లక్ష్మణ్, కాయితి బాలు, కాంబోజ ముత్యం, మునిందర్ రెడ్డి, కాశీనాథ్, మేడి కిషన్, ప్రసాద్ రెడ్డి, సల్మాన్ , కృష్ణ, నవీన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.