Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2025, 4:36 pm Posted by : ramakrishna

లింబాద్రిగుట్ట అర్చకులపై జర్నలిస్ట్ ల ఫిర్యాదు

భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రి గుట్టకు చెందిన అర్చకులు విధి నిర్వహణ జర్నలిస్ట్ ను పరుస పదజాలంతో, వృత్తిని నిందిస్తూ ధూషిస్తిన్నారని, ఈ ఘటనలకు కారణమైన అర్చకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భీమ్ గల్ ప్రెస్ క్లబ్ సభ్యులు గురువారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వామి వారిపై భక్తి తాము చేస్తున్నది కూడా దేవుని సేవానేనని, ఆకాణరంగా అర్చకులు వ్యక్తిగతంగా, వృత్తి పరంగా దూషణ చేయడం శోచనీయమన్నారు. భక్తుల సాక్షిగా స్వామి క్యూ వద్ద పరుస పదజాలంతో అవమానపరిచరని వారు పేర్కొంటూ ఎస్సై సందీప్ కు ఫిర్యాదు చేశారు. గుట్టపై గల క్యూ వద్దనే కాకుండా అన్నదానం వద్ద కూడా కొందరు సేవ చేసే వారు కూడా ఇష్టరీతిన మాట్లాడుతూ అవమానపరుస్తున్నారని, రథోత్సవ సమయంలో కూడా అర్చకులు భక్తులపై చేయి చేసుకుకొన్నారని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులన్న అర్చకులు లెక్కలేదని వారన్నారు. జర్నలిస్ట్ ల పట్ల అర్చకులు ఇలా వ్యవహారిస్తే భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని వారన్నారు. ఈ ఘటనకు విషయమై పోలీసులు విచారణ జరిపించి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ సభ్యులు ఎస్సైని కోరారు.