జోస్ ఆలుక్కాస్ సామాజిక సేవలు అభినందనీయం

నిజామాబాద్, బతుకమ్మ :  సమాజంలో విద్య,  వైద్య రంగాలకు జోస్ ఆలుక్కాస్ సంస్థ చేస్తున్న సేవ కార్యక్రమాలు అభినందనీయమని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కొనియాడారు. శనివారం జోస్ ఆలుక్కాస్ జువెలరీ షోరూం మూడో వార్షికోత్సవ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలోని ప్రాధాన్యతా రంగాలైన ఆసుపత్రులకు, పాఠశాలకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూరుస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం మూడో వార్షికోత్సవ సందర్భంగా    చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలవడం గర్వకారణమన్నారు. నాలుగు ప్రభుత్వ పాఠశాలకు సుమారు...