Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2025, 3:25 pm Posted by : ramakrishna

జోస్ ఆలుక్కాస్ సామాజిక సేవ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం

మోపాల్, బతుకమ్మ : జోస్ ఆలుక్కాస్ సామాజిక సేవ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం అని హెచ్ఎం ప్రసాద్ అన్నారు. సోమవారం మోగ్పాల్ ప్రాథమిక పాఠశాలలో  జోస్ ఆలుక్కాస్ సంస్థ సి ఎస్ ఆర్ ఫండ్ ద్వారా అందజేసిన సదుపాయాల ప్రారంభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై హెచ్ఎం ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తూ సమాజ సేవకు పాటుపడడం  అభినందనీయమని కొనియాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవనీత మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం విలువైన వస్తువులు అందజేయడం గొప్ప విషయం అన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సేవ కార్యక్రమాలు చేస్తున్న మొట్టమొదటి సంస్థ గా నిలిచిందన్నారు. పాఠశాల ఉపాధ్యాయుని శ్రీదేవి మేడం మాట్లాడుతూ వ్యాపార అభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. మరి కొన్ని పాఠశాలకు ఇలాంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. పాఠశాలకు అవసరమైన నీటి శుద్ధి యంత్రం, డిజిటల్ పాఠాలు బోధించడానికి వీలుగా పెద్ద టీవీ,  డ్యూయల్ డెస్క్ బెంచీలు, మైక్ సెట్, ప్రింటర్ వితరణ చేయడం ద్వారా సదుపాయాలు కల్పించడం గొప్ప మనసుకు నిదర్శనం అన్నారు.  విద్యార్థులు సౌకర్యాలు ఉపయోగించుకుని శ్రద్ధగా చదివి ఉన్నత స్థానాలు నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం రూ. 2.29 లక్షల విలువచేసే  చెక్కును పాఠశాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ దనిష్ , అకౌంట్స్ మేనేజర్ జితిన్, పిఆర్ఓ పీప్పెర నరేందర్,  పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నవనీత ,శ్రీదేవి, మహేందర్,రాజ్ కుమార్, నాగలక్ష్మి, సుష్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

Jose Alukkas' social service programs are inspiring