ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

లింగంపేట్, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గం, లింగంపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – “మదన్ మోహన్ నాయకత్వంలో గత 30 ఏళ్లుగా చూడని అభివృద్ధి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కేవలం 20 నెలల్లోనే సాధ్యమైంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఈ నియోజకవర్గంలో భాగస్వాములు కావాలని, ప్రజల సేవలో మదన్ మోహన్ తో కలిసి పనిచేయాలని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము”...