Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 7:26 pm Posted by : ramakrishna

బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అంజయ్య గారు ఈరోజు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ “ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఎంతో ప్రేరణ కలిగింది. ప్రజల కోసం నిజంగా పని చేస్తున్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది అనే నమ్మకంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను” అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.