Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 January 2025, 5:38 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీలో చేరిక

నిజామాబాద్, బతుకమ్మ : స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో తెలంగాణా బీసీ మహాసభ నిజామాబాద్ జిల్లా కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణా రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సలహాదారులు మహామ్మద్ అలీ షబ్బీర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినాయక్ నగర్ మండలం బీజేవైఎం ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్ నగర పద్మశాలి యువజన సంఘం జాయింట్ సెక్రటరీ పాశకంటి మహేష్, బీ ఆర్ యస్ పార్టీ 25 డివిజన్ ఇంచార్జి, మాజీ జండా గుడి డైరెక్టర్, నిజామాబాద్ నగర పద్మశాలి యువజన సంఘం సెక్రటరీ తుమ్మ నాగభూషణం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా తెలంగాణా ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ముఖ్యంగా బీసీ లా కోసం చేస్తున్నా అభివృద్ధినీ చూసి ఆకర్షితులై  పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, ఈర్ల శేఖర్, సయ్యద్ రహీం తదితరులు పాల్గొన్నారు.