బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని లాడేగావ్ గ్రామ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు పోలకంవార్ విట్టల్,శెట్టివార్ హన్మండ్లు,మారుతి, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పోలకంవార్ విట్టల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. మారుమూల జుక్కల్ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారని, నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. జుక్కల్ అభివృద్ధి కేవలం మన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతోనే సాధ్యమని బలంగా విశ్వసిస్తూ వారి నాయకత్వాన్ని బలపర్చాలని కాంగ్రెస్ పార్టీలో చేరామని అన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో కలిసి లాడేగావ్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లాడేగాం కాంగ్రెస్ నాయకులు తుకారం పటేల్, సతీష్ పటేల్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
