Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 6:31 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీలో చేరిక

గాంధారి, బతుకమ్మ : గాంధారి మండలం బొప్పాజివాడి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షలు జాదవ్ రవి, మాజీ వార్డ్ మెంబెర్ గైని రాజు, గాలి గణపతి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో ప్రేరణనిచ్చాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఎమ్మెల్యేతో పోల్చితే, ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎంతో విస్తృతంగా, ప్రజల జీవితాలను మార్చే విధంగా ఉన్నాయని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, ఉచిత కరెంటు, కొత్త రేషన్ కార్డులు వంటి అనేక పధకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అని అన్నారు. గతంతో పోల్చుకుంటే ఎన్నడూ లేని విధంగా బొప్పాజివాడి గ్రామంలో అభివృద్ధికి నాంది పలికింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ వచ్చిన తర్వాతే గ్రామం నిజమైన అభివృద్ధి దిశగా అడుగులు వేసింది అని పేర్కొన్నారు.

Joining the Congress Party