Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 5:37 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీలో చేరిక

సదాశివ నగర్, బతుకమ్మ : సదాశివనగర్ మండలం బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ వీడీసీ  చైర్మన్ ముదాం సత్యం, శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, “గత ప్రభుత్వ పాలకుల అసమర్ధ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ప్రజలకు న్యాయం జరగకపోవడం వల్ల విసుగొచ్చిందని తెలిపారు. గత 18 నెలల్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో ఎల్లారెడ్డిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, అది చూసి ఆకర్షితులమయ్యాం” అని చెప్పారు.