Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 October 2025, 8:05 pm Posted by : ramakrishna

బీజేపీ పార్టీలో చేరికలు

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంపు గ్రామంలో   ఇతర పార్టీల నుండి స్వచ్ఛందంగా బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ  ఎమ్మెల్యే ఎండల లష్మినారాయణ సమక్షంలో ఆదివారం బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎండల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. రానున్న కొద్దీ రోజుల్లో రుద్రూర్ మండలంలో ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో  కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్, చంద్రశేఖర్, నర్సింలు, గోపాల్, అజయకుమార్, సాయిబాబు, హరికృష్ణ, ఎల్లయ్య, బీజేపీ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి  భూషిగం సుధాకర్ గౌడ్, బూత్ అధ్యక్షులు అలపర్తి మురళి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.