Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 1:27 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ లో చేరిక 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో నాగిరెడ్డి పేట్ మండలం పెద్ద ఆత్మకూరు నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.  పెద్ద ఆత్మకూరు గ్రామ బీఆర్ఎస్ పార్టీ నుంచి కుంట అఖిల యుగంధర్ రెడ్డి,  మహిళలకు ఎమ్మెల్యే మదన్ మోహన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా కుంట అఖిల యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో ప్రేరణనిచ్చాయని పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే ఎన్నడూ లేని విధంగా పెద్ద ఆత్మకూరు గ్రామంలో అభివృద్ధికి  జరుగుతోందని, ఎమ్మెల్యే మదన్ మోహన్  వచ్చిన తర్వాతే గ్రామం అభివృద్ధి వైపు అడుగులు వేసిందని పేర్కొన్నారు.