మృతి చెందిన ఔట్‌సోర్సింగ్ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి
. . . బీఎల్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మృతి చెందిన మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ (బీఎల్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లుగా మృతి చెందిన మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికుల కుటుంబాలకు రావాల్సిన ఇన్సూరెన్స్, పీఎఫ్, పెన్షన్ తదితర ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్...