ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలోని శ్రీ భీమేశ్వరాలయం సమీపంలోని చెక్ డ్యాం లోని పూడికతీత పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ఉపాధి హామీ పథకం క్రింద కూలీలకు పనులు కల్పించాలని అన్నారు. గ్రామంలో 240 హౌస్ హోల్డ్స్ కి గాను 316 జాబ్ కార్డ్స్ ఉన్నాయనీ, 280 యాక్టివ్ కూలీలు...