గ్రూప్ 4 ఫలితాల్లో బడా భీమ్ గల్ వాసికి ఉద్యోగం
భీమ్ గల్, బతుకమ్మ : ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షల ఫలితాల్లో మండలంలోని బడా భీమ్ గల్ గ్రామ వాసి కి ఉద్యోగం లభించింది. ఈ ఫలితాల్లో విజయం సాధించిన మోర్తడ్ శివ కు రెవిన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం లభించింది. శివ బాసర ట్రిపుల్ ఐటీ బీ. టెక్ పూర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీలో ఎం. టెక్ చదివారు. ప్రభుత్వం ఉద్యోగం సాధించిన శివ ను గ్రామస్థులు అభినందించారు.