Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 6:41 pm Posted by : ramakrishna

ఒకేషనల్ విద్యార్థులకు జాబ్ మేళా

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఇంటర్మీడియట్ వొకేషనల్ గ్రూపుల్లో పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు ఈ నెల 7వ తేదీన సికింద్రాబాద్ లోని కస్తూరిబా జూనియర్ కళాశాలలో అప్రెంటిషిప్, జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. 2023,2024, 2025, 2026 సంవత్సరాలలో పాస్ అయిన వొకేషనల్ అన్ని గ్రూప్ ల విద్యార్థినీ, విద్యార్థులు ఈ జాబ్ మేళా లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ లోని మారేడుపల్లి లో గల కస్తూర్బా జూనియర్ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారని, ఉదయం వొకేషనల్ పారా మెడికల్ గ్రూప్ ల వారికి, మధ్యాహ్నం నాన్ పారా మెడికల్ గ్రూప్ ల విద్యార్థిని విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు. జాబ్ మేళా లో పాల్గొనే వారు వారి ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు, జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోల తో హాజరు కావాలని తెలిపారు. అప్రెంటిషిప్ విద్యార్థులకు 9,600 రూపాయలు స్టైఫండ్ ఇస్తారని అలాగే అప్రెంటిషిప్ పూర్తయిన తరవాత సర్టిఫికెట్ ఇస్తారని తెలిపారు. నేరుగా ఉద్యోగావకాశాలు కూడా ఈ జాబ్ మేళా లో కల్పిస్తారని తెలిపారు.