గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగ మేళా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్, కెరీర్ గైడెన్స్ విభాగాల, హెచ్సీఎల్ టెక్ బి సంయుక్తంగా ఉద్యోగ మేళా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం నిర్వహించిన ఉద్యోగ మేళాలో 50మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వారిలో 15మంది అభ్యర్థులు ఎంపికయ్యారన్నారు.  గిరిరాజ్ కళాశాల ఎప్పుడూ ఉద్యోగ కల్పనలో ముందంజలో ఉంటుందన్నారు. డీఐఈఓ రవి కుమార్ మాట్లాడుతూ ఇంటర్ అర్హతతో హెచ్సీఎల్ టెక్ బి సంస్థలో ఇలాంటి ఉపాధి అవకాశాలు...