- ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్
భీమ్ గల్, బతుకమ్మ : ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏ టి సి ) కోర్స్ ల్లో చేరడం వల్ల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులువుగా లభిస్తాయని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన భీమ్ గల్ ఐ టీ ఐ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న ఏ టీ సీ సెంటర్ ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిరుద్యోగ యువతీ, యువకులకు ఆరు కోర్సులపై శిక్షణ ఇచ్చి 100% ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో యంత్రాలపై అవగాహన కల్పిస్తూ ఈ కోర్సులను రూపొందించడం జరిగిందన్నారు. 175 మంది దరఖాస్తులకు గాను 100 మంది అప్లై చేసుకోగా ఇంకా 75 మందికి ఈ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉన్నదన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో ఐటిఐ కాలేజ్ ప్రిన్సిపల్, సూపరిండెంట్ , ఇన్స్ట్రక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.