జో అచ్యుతానంద.. జోజో ముకుందా..

లాలి పరమానంద రాజా గోవిందా అంగరంగ వైభవంగా నరసింహుని డోలాసేవ భీమ్ గల్, బతుకమ్మ : దక్షిణ బద్రిగా పేరొందిన పుణ్యక్షేత్రం అయిన నింబాచల క్షేత్రం(లింబాద్రిగుట్ట) పై జరుగుతున్న శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం కమల పుష్కరిణి మండపంపై స్వామి వారికి డోల సేవను నంబి అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఉత్సవ ప్రారంభంలో ఆహ్వానీతులైన సకల దేవతలకు ఉద్వాసన పలికారు. ధ్వజ అవరోహణము చేసి ఉద్వాసన బలిని గావించారు.అనంతరం కమల పుష్కరిణిపై గల మండపానికి శ్రీ లక్మీ నృసింహుల...