- క్యాంపస్‌లో సరైన సదుపాయాలు లేవు
- తక్షణమే శాశ్వత క్యాంపస్‌తోపాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్
- విద్యార్థులకు మద్దతు తెలిపిన రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్
- మద్దతు తెలిపిన వారిని అరెస్ట్ చేసి వేములవాడ పోలీస్ స్టేషన్ కు తరలింపు
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం జేఎన్టీయూ విద్యార్థుని విద్యార్థులు కళాశాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకా నిర్వహించారు. విద్యార్థుల రాస్తారోకోకు మద్దతు తెలిపిన భారత రాష్ట్ర సమితి నాయకులు కంచర్ల రవి గౌడ్.ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కాలేజీ ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు స్వంత క్యాంపస్ ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా ఇచ్చిన భవనానికి కూడా తాళం వేసినందువల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.క్యాంపస్‌లో సరైన సదుపాయాలు, ముఖ్యంగా ల్యాబ్‌లు లేకపోవడంతో ప్రాక్టికల్స్ కోసం కొండగట్టు జేఎన్టీయూకు వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎనిమిది గదుల్లోనే తరగతులు నడుస్తుండటంతో పాఠశాల వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని వారు తెలిపారు. అదనంగా హాస్టల్ నుండి కాలేజీకి ప్రతిరోజూ రెండు కిలోమీటర్లు నడుస్తూ రావాల్సి రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. తక్షణమే శాశ్వత క్యాంపస్‌తోపాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో విద్యార్థిని విద్యార్థులు,బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
