బతుకమ్మ, ఏర్గట్ల : జీవో25 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పి ఆర్ టి యు ఏర్గట్ల మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత క్షీణించడానికి ప్రధాన కారణం జీవో 25 అని ఆయన పేర్కొన్నారు. ఈ జీవో కారణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడి,విద్యార్థులు సరైన సబ్జెక్ట్ బోధన నుండి దూరమవుతున్నారని ఏర్గట్ల మండల పిఆర్టియు అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ తెలిపారు. జీవో నం.25 ప్రకారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా మాత్రమే ఉపాధ్యాయుల పోస్టులు కేటాయించడం అనేది పూర్తిగా అవాస్తవమైన విధానం అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రైమరీ పాఠశాలల్లో 11- 60 లోపు విద్యార్థులు ఉన్నపక్షంలో కేవలం ఇద్దరు, 90 లోపు విద్యార్థులు ఉన్న దగ్గర కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉండి,నిత్యం ఎఫ్ ఆర్ ఎస్,ఎం డి ఎం, పి టి ఏం,యు డి ఐ ఎస్ ఈ, లాంటి వాటితో పాటు రోజు వారి పనులు ప్రతీది ఆన్ లైన్ చేస్తూ ఎఫ్ఎల్ ఎన్ ఏ ఎక్స్ ఎల్ అని ప్రతీ రోజు 45 నిముషాలు వెనక బడిన విద్యార్థుల కొరకు కేటాయిస్తూ, ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ ఒక వైపు హెచ్ఎం గా పూర్తి బాధ్యతలను నిర్వహిస్తూ,5 తరగతులకు కలిపి 18 సబ్జెక్టు లు ఎలా బోధిస్తారని ఇది పూర్తిగా విద్యా ప్రమాణాలను దెబ్బతీస్తుందని చెప్పారు. 20 మంది, 30 మంది, 40 మంది విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలో సబ్జెక్టుకి ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్లుగా విద్యార్థి జీవితానికి ప్రాథమిక విద్య బాల్యం అనేది పునాది ఆ పునాది బలపడేలా ప్రైమరీ పాఠశాలలో జీవో 25ను రద్దు చేసి ప్రతీ సబ్జెక్టు కి ఒక టీచర్ ను నియమించినపుడే విద్యార్థులు ప్రాథమిక దశలో అన్ని పరిపూర్ణంగా నేర్చుకొని ఉన్నత పాఠశాలలకు రాగలుగుతారు, అప్పుడు మాత్రమే గుణాత్మక విద్య అందుతుందని ఆ విధంగా ప్రభుత్వం తక్షణమే ఆలోచించాలని కోరారు.