Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2025, 1:49 pm Posted by : ramakrishna

జీవో నంబర్ 25 రద్దు చేయాలి

ఏర్గట్ల, బతుకమ్మ :   జీవో నంబర్ 25 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పీఆర్ టీయూ  ఏర్గట్ల మండల అధ్యక్షుడు
కృష్ణ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు క్షీణించడానికి ప్రధాన కారణం జీవో 25 అని ఆయన పేర్కొన్నారు.  ఈ జీవో కారణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడి,విద్యార్థులు సరైన సబ్జెక్ట్ బోధన నుంచి  దూరమవుతున్నారని  తెలిపారు.  జీవో నం.25 ప్రకారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా మాత్రమే ఉపాధ్యాయుల పోస్టులు కేటాయించడం అనేది పూర్తిగా అవాస్తవమైన విధానం అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రైమరీ పాఠశాలలో  జీవో 25ను రద్దు చేసి ప్రతి సబ్జెక్టు కి ఒక టీచర్ ను నియమించినపుడే విద్యార్థులు ప్రాథమిక దశలో విద్యా విషయాలు నేర్చుకోగలగుతారని పేర్కొన్నారు.  ప్రభుత్వం తక్షణమే ఆలోచించాలని  కోరారు.