Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2024, 7:25 pm Posted by : ramakrishna

” జితేందర్ రెడ్డి” ఒక చిత్రం మాత్రమే కాదు.. ఒక వీరుని చరిత్ర

  • నేటి తరం యువత తప్పకుండా చూడాల్సిన చిత్రమిది
  •  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడుదలైనజితేందర్ రెడ్డి సినిమా కేవలం వినోదం కోసం నిర్మించిన చిత్రం కాదని దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించిన ఒక వీరుని చరిత్ర అని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త అన్నారు. మూవీ రిలీజ్ సందర్బంగా నగరంలో ఉషామయూరి థియేటర్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముదిగంటి జితేందర్ రెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ముదిగంటి జితేందర్ రెడ్డి జాతీయవాద సిద్ధాంతం కోసం,దేశం కోసం, ధర్మం కోసం, అఖండ భారత్ యే లక్ష్యంగా నరహంతక నక్సలైట్లకు ఎదురెల్లి ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరుడు జితేందర్ రెడ్డి అని అన్నారు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే అంటు వామపక్ష విద్యార్ధి సంఘాల, కమ్యూనిస్ట్ ముసుగులో దేశాద్రోహనికి పాల్పడుతున్న వారి పాలిట సింహ స్వప్నంగా వారికీ కంటిమీద కునుకు లేకుండా చేసిన వ్యక్తి టైగర్ జీతన్న అన్నారు. మహాభారత యుద్ధంలో అభిమన్యుణ్ణి ఒక్కొక్కరుగా ఎదుర్కొలేని కౌరవులు అందరు కలిసి ఎలా అయితే హతమార్చారో అలాగే జీతన్నాను వంద మంది ఒకేసారి చుట్టూముట్టి దారుణంగా చంపారన్నారు. ఈ దేశ యువత తెలుసుకోవాల్సింది అక్బర్, బాబర్, ఔరంగా జేబుల చరిత్ర కాదని ఈ దేశం కోసం, ధర్మం కోసం, తమ ప్రాణాలు అర్పించిన రామన్న, గోపన్న, సామా జగన్ అన్న, జితేందర్ రెడ్డి లాంటి వీరుల చరిత్ర తెలుసుకోవాలన్నారు. ముదిగంటి జితేందర్ రెడ్డి జీవిత చరిత్రను వెండి తెరమీదకి తెచ్చి యువతరానికి మంచి నిర్మాణాత్మక సందేశాన్ని అందించన చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వివిధ క్షేత్రల సంఘ్ పెద్దలతో కలిసి సినిమాను విక్షించారు.

"Jitender Reddy" is not just a film.. the history of a hero