Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 6:00 pm Posted by : ramakrishna

జేసీఐ ఇండియా జోన్ 12 కోఆర్డినేటర్ గా జిలకార్ నయన్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  జేసీఐ ఇండియా జోన్ 12 నూతన కార్యవర్గాన్ని హైదరాబాద్ లో గురువారం ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో జేసీఐ ఇందూరు కు చెందిన పూర్వ అధ్యక్షులు జిలకార్ నయన్ ను జేసీఐ వారోత్సవాల, గ్రీటింగ్ కో ఆర్డినేటర్ గా ఎన్నుకున్నారు. 2024 లో ఉత్తమ జేసీఐ వారోత్సవాల కోఆర్డినేటర్  గా ప్రతిభ కనబరిచినందుకు 2025 జోన్ అధ్యక్షులు చతుర్వేది వుటుకూరు, 2024 జోన్ అధ్యక్షులు గోవింద్ కంకాని నయన్ కు వారోత్సవాల, గ్రీటింగ్స్ కోఆర్డినేటర్ గా స్థానం కల్పించి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో  పూర్వ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు సునీల్ కుమార్ రుమల్ల, పూర్వ జాతీయ అధ్యక్షులు శిరీష్  దండు,  2025 ఎన్నికైన  జోన్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్, దిలీప్,సంకేత్, కార్యదర్శి జయంత్ శెట్టి మరియు నూతన కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.