Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 6:17 pm Posted by : ramakrishna

జిలకర్ నయన్ కు జేసీఐ ఇండియా జోన్-12 కోఆర్ఢినేటర్ గా నియామకం

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

జిలకర్ నయన్ కు జేసీఐ ఇండియా జోన్ -12 , 2025 కోఆర్ఢినేటర్ గా నియామిస్తూ జోన్ అధ్యక్షులు నియామక పత్రం అందజేశారు. హైదరాబాద్ లో జేసీఐ ఇండియా జోన్ 12, 2025 నూతన కార్యవర్గం ఏర్పాటు అయ్యింది. జేసీఐ ఇందూర్ కు చెందిన పూర్వ అధ్యక్షులు జీలకార్ నయన్ కు జేసీఐ వారోత్సవాల, గ్రీటింగ్స్ కోఆర్డినేటర్ గా స్థానం లభించింది. 2024 లో ఉత్తమ జేసీఐ వారోత్సవాల కోఆర్డినేటర్  గా ప్రతిభ కనబరిచినందుకు 2025 జోన్ అధ్యక్షులు చతుర్వేది వుటుకూరు, 2024 జోన్ అధ్యక్షులు గోవింద్ కంకాని నయన్ కు వారోత్సవాల, గ్రీటింగ్స్ కోఆర్డినేటర్ గా స్థానం కలిపించి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో  పూర్వ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు సునీల్ కుమార్ రుమల్ల, పూర్వ జాతీయ అధ్యక్షులు శిరీష్  దండు,2025 ఎన్నికైన  జోన్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్, దిలీప్ ,సంకేత్, కార్యదర్శి జయంత్ శెట్టి, నూతన కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.