రుద్రూర్ (వర్ని), బతుకమ్మ : వర్ని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వర్ని శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఝాన్సీ లక్ష్మీబాయి 197వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని వర్ని మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు, దేశభక్తి గీతాలు, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఇందూర్ విభాగ్ ఎస్ ఎఫ్ ఎస్ కన్వీనర్ దర్శనం ప్రవీణ్ మాట్లాడుతూ.. ఝాన్సీ లక్ష్మీబాయి నేతృత్వానికి కర్తృతవనికి, మాతృత్వానికి ప్రతీక అని, బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన వీరవనిత అని, ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
