ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి

బిచ్కుంద, బతుకమ్మ:  వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని విద్యార్థినులకు సర్కిల్ ఇన్ స్పెక్టర్ జగడం నరేశ్ సూచించారు. స్త్రీ శక్తి దివాస్ ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ మంగళవారం ఆధ్వర్యంలో నిర్వహించారు. సీఐ నరేశ్, కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి లక్ష్మీబాయి చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులు అర్పించారు. ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర ప్రతి ఒక్క విద్యార్థినికి ఆదర్శమని ప్రతి విద్యార్థి ఝాన్సీ లక్ష్మీబాయి ని స్ఫూర్తిగా తీసుకొని అడుగులు ముందు వేయాల్సిన...