సంఘ కాపరి బ్రదర్ రమేష్ జాన్
ఆర్మూర్, బతుకమ్మ : పాపం మూలాన దేవునికి, మనుషులకు మధ్య పెరిగిన దూరం అనే ఆగాధాన్ని పూడ్చి దేవునితో మనిషికి సంబంధం ఏర్పార్చేందుకే యేసు ఈ సుమూహూర్తన జన్మించాడని అగాపే వర్షిప్ సెంటర్ సంఘ కాపరి, దైవజనులు బ్రదర్ రమేష్ జాన్ ఉద్బొదించారు.బుధవారం క్రిస్మస్ పర్వాదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని అగాపే వర్షిప్ సెంటర్ లో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను వైభవంగా జరుపుకొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తు దేవుడైన క్రీస్తు మానవాళికి సంతోషం, సమాధానాలను ఇవ్వడానికే దైవమానవునిగా ఈ భువిపై అవతరించడని తెలిపారు. ఆత్మరూపి అయిన ఆ ప్రభు జన్మదిన వేడుకులు, ప్రార్థనలు లోక కళ్యాణంను జరిపిస్తాయని ఆయన ప్రభోదించారు. ఈ సందర్బంగా సెంటర్ లో కేక్ కట్ చేసి లోకారక్షకుడైన ప్రభు సంకీర్తనలను ఆలపిస్తూ, చిన్నారుల నృత్యాలు చేశారు. విశ్వాసకులు కేకును ఒకరినొకరు తినిపించుకుంటూ క్రిస్మస్ ను ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, దైవజనులు ప్రకాష్ పాస్టర్,సంజయ్, శశి, ఉదయ్, నిస్సి, అభిషేక్ రాఫా, ప్రభు, రమేష్, ఇసాకు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.