ఇందూర్ తిరుపతిగా పేరొందిన జెండా బాలాజీ
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జెండా జాతర సందర్బంగా జెండా బాలాజీ ఆలయంలో నిర్వహించిన జాతర కార్యక్రమంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు జెండా బాలాజీ జాతర ఉత్సవాలకు వందేళ్ల ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఇందూర్ జిల్లా ప్రజలు ఇందూర్ తిరుపతిగా జెండా గుడిని కొలువడం ఇక్కడ విశేషం అన్నారు. గోల్ హనుమాన్ వద్ద గల జెండా బాలాజీ మందిరంలో...