Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 8:21 pm Posted by : ramakrishna

సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలపై అత్మ పరిశీలన చేసుకోవాలి

 

. . . సినీయర్ నాయకులు జీవన్ రెడ్డి విజ్ఞతతో మాట్లాడాలి

. . .  మీపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోవద్దు

. . .  రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

 నిజామాబాద్, బతుకమ్మ :

కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ జీవనం గడిపిన జీవన్ రెడ్డి పట్ల ప్రగాఢ సానుభూతి ఉంది. అదేవిధంగా వెళ్ళిపోతున్నందుకు బాధగా కూడా ఉంది. జీవనరెడ్డి ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్  నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో  మానాల మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ,వేం నరేందర్ లపై  చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తన అవసరాల కోసం పార్టీని విడుతూ పార్టీ నుండి బయటికి వెళ్లే ముందు ఎవరిపైనైనా అబండాలు వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఆయన చేసే వాక్యాలను ఖండిస్తున్నాం అన్నారు. కెసిఆర్ రాక్షస పాలన తెరదింపి ఇందిరమ్మ ప్రజాపాలనను నాంది పలికిన వ్యక్తి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటువంటి వ్యక్తి పైన ఆరోపణలు చేయడం సరికాదు అని తెలిపారు. రేవంత్ రెడ్డి ఆలోచనలతో సీనియర్ నాయకులైన మీకు ఏఐసీసీ నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ ఇవ్వండి జరిగింది. వేరే పార్టీ నుండి వచ్చిన వ్యక్తులకు అందలం ఎక్కిస్తున్నారన్న మీ మాట  ఏఐసీసీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గాని మహేష్ కుమార్ గౌడ్ ముందుకు వెళ్తారని మీకు తెలియనిదా అని గుర్తు చెశారు.

Jeevan Reddy's allegations against CM Revanth Reddy should be introspected
Jeevan Reddy’s allegations against CM Revanth Reddy should be introspected

మీరు ఇక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు  బాల్కొండ నియోజకవర్గనికి  ఈరావత్రి అనిల్ ని మానాల మోహన్ రెడ్డి లు రాకూడదు అని చెపింది మీరు కారణం అక్కడ వున్నా సునిల్  బహుశా ఆరోజు బతుకచ్చినోలకి ఇంట్లో పుట్టిన వారు అని గుర్తుకు రాలేదేమోని నేను భవిస్తున్న ఆ రోజే గుర్తించి ఉంటే మేము నిజంగా గర్వపడేవాళ్ళం కానీ సమస్య మీకు వచ్చినప్పుడు ఒకలా మాట్లాడడం మీ వయసుకు మీ విజ్ఞతకు వదిలేస్తున్న అన్నారు. వేం నరేందర్ రెడ్డి పై ఆరోపణలు చేయడం సరికాదు 2017 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఈ పార్టీలో లోకి వచ్చారు చాలామంది టికెట్స్ కోసం వస్తారు కానీ 2018 2023లో కూడా టికెట్ ఇవ్వకున్న కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పని చేసినటువంటి వ్యక్తి తొమ్మిది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ ని గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి అలాంటి వారిపై ఆరోపణలు చేయడం మీరు ఆత్మ పరిశీలన చేసుకో అన్నారు.ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్,రాష్ట్ర ఎన్ఎస్ యుఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్,జగడం సుమన్, సాయి,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.