Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2025, 5:10 pm Posted by : ramakrishna

అంతర్జాతీయ పరిశోధన సదస్సుకు అందె జీవన్ రావు

  • అఖిల భారత రచయితల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంకణాల రాజేశ్వర్

 

భీమ్ గల్, బతుకమ్మ : బంగ్లాదేశ్ లోని రాజ షాహి ఇన్వర్సిటీలో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించనున్న మొట్ట మొదటి అంతర్జాతీయ పరిశోధన సదస్సుకు రాష్ట్ర అవార్డు గ్రహీత, గుంజీళ్ళ జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు పాల్గొననున్నట్లు అఖిల భారత రచయిత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సదస్సులో ఆయన చేసిన పరిశోధన సూపర్ బ్రెయిన్ యోగ ఏజ్ ఏ పెడగాజికల్ టూల్ ఫర్ సుపిరియల్ ఇంటలెక్ట్ అండ్ వెల్ బీయింగ్ అనే అంశాన్ని సమర్పించనున్నారన్నారు. ఈ పరిశోధన పై సవివరంగా సదస్సులో ప్రసంగిస్తారని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగ జాతీయ ప్రచారక్ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్బంగా జీవన్ రావు ను జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్ లు అభినందించారు.