నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జేసీ వీక్ వారోత్సవాలు సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు జేసిఐ సిల్వర్ జూబ్లీ ప్రెసిడెంట్ జేసి పెందోటి గౌతమి, జేసీ వీక్ చైర్మన్ కర్క రమేష్ తెలిపారు. మంగళవారం జేసీ వీక్ వారోత్సవాలు ప్రారంభం కాగా మొదటి రోజు జండా ఆవిష్కరణ, (ఫ్లాగ్ హోస్టిగ్) పాటు ర్యాలీ నిర్వహించామని, రెండవ రోజు.ఎం పవర్ పై ట్రేయినింగ్ ఉంటుందని, మూడవ రోజు గేమ్స్ అండ్ స్పోర్ట్స్, వెల్నెస్ డే, నాలుగవ రోజు బోర్డు రూం బీట్స్, ఐదవ రోజు వాయిస్ ఆఫ్ డ్యూటీ, హ్యూమన్ డ్యూటీ, ఆరవ రోజు గ్లోబల్ రికార్డు చాలెంజ్, బిగ్గెస్ట్ యూత్ ఇన్విటేషన్ డ్రైవ్, ఏడవ రోజు ముగింపు కార్యక్రమం సెలబ్రేషన్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు కార్యక్రమంలో పూర్వ అద్యక్షులు శ్రీహరి, చంద్ర శేఖర్, యాదేశ్, సెక్రటరీ జై పాల్ కాలే, శేఖర్ పాల్గొన్నారు.
