Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 July 2025, 8:48 pm Posted by : ramakrishna

జవహర్ నవోదయ ఫలితాలు విడుదల

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జవహర్ నవోదయ విద్యాలయ ఫలితాలు విడుదల చేసినట్టు ఇన్చార్జి ప్రిన్సిపాల్ మను యోహానన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరవ తరగతిలో ప్రవేశానికి 40 మంది విద్యార్థుల ఎంపిక జాబితాను ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఈనెల 14వ తేదీ నుండి విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చునన్నారు. హాల్ టికెట్ల ఆధారంగా ఫలితాలు విడుదల చేసినట్లు జిల్లా ఇంచార్జీ ప్రిన్సిపాల్ మను యోహనన్ తెలిపారు.