Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 January 2025, 6:38 pm Posted by : ramakrishna

జప్తి జాన్కంపల్లికి రెండో బహుమతి

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : సంక్రాంతి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలలో మండలంలోని జప్తి జాన్కంపల్లి క్రికెట్ టీం రెండవ బహుమతిని గెలుచుకున్నట్లు జప్తి జాన్కంపల్లి గ్రామ క్రికెట్ క్రీడాకారులు తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ పోటీలలో పోచారం టీం మొదటి బహుమతిని గెలుపొందగా, ద్వితీయ బహుమతి జప్తి జాన్కంపల్లి టీం గెలుపొందగా 5555 రూపాయల నగదు బహుమతి తో పాటు షీల్డ్ ను బహూకరించారు. క్రికెట్ టోర్నమెంట్ లో రెండవ బహుమతి సాధించిన జప్తి జాన్కంపల్లి టీం క్రీడాకారులు తాము పొందిన షీల్డ్ ను గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి శంకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా రెండవ బహుమతి పొందిన క్రీడాకారులను గ్రామస్తులు, పంచాయతీ కార్యదర్శి శంకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కారోబార్ పోచయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు.