జపాన్ కంపెనీ వినూత్న ఆలోచన.. హ్యాంగోవర్ లీవ్

వెబ్ డెస్క్, బతుకమ్మ :  జపాన్ కు చెందిన ట్రస్ట్ర్ రింగ్ అనే సంస్థ వినూత్నంగా నూతన లీవ్ ను ఉద్యోగులకు అమలు చేస్తోంది. తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు ఉచితంగా తాగినంత ఆల్కహాల్ ను అందిస్తోంది.  దీంతో పాటు హ్యాంగోవర్ లీవ్  కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈహ్యాంగోవర్  లీవ్ తమకు బాగా ఉపయోగపడుతోందని కంపెనీ ఉద్యోగులు పేర్కొంటున్నారు.