Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2025, 4:40 pm Posted by : ramakrishna

జనవరి 9 డిమాండ్ డే ను సక్సెస్ చెయ్యాలి

ఏఐయుకెఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బి.బాబన్న

సిరికొండ, బతుకమ్మ : రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న జనవరి 9 డిమాండ్ డే కు జిల్లాలోని రైతాంగం పెద్దఎత్తున పాల్గొనాలని కార్యక్రమాన్ని సక్సెస్ చెయ్యాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) జిల్లా సహాయ కార్యదర్శి బి.బాబన్న పిలుపును ఇచ్చారు. శనివారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఏఐయుకెఎస్ జనవరి 09 డిమాండ్ డే పోస్టర్స్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ డిల్లీ రైతంగా పోరాటంతో దిగివచ్చి ఎం ఎస్ పి చట్టం హామీని వ్రాతపూర్వకంగా వ్రాసి ఇచ్చి,ఇప్పుడు విస్మరించిందని ఆయన ఆరోపించారు. రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపుతుందని,వ్యవసాయాన్ని కార్పొరేట్ లకు అప్ప జెప్పే కుట్రకు పూనుకుంటుందని అయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసాను ఒకేసారి ఇవ్వాలని, నాన్చివేత ధోరణి సరికాదు అన్నారు.
తాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాపీ సమగ్రంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్ ) ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ కమిటీ రైతంగా సమస్యలపై జనవరి09న డిమండ్స్ డే తోపాటుగా ఆందోళనలకు పిలుపును ఇచ్చిందన్నారు.రైతాంగం తమ సమస్యలపై పోరాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు ఎం. నారగౌడ్, ఎం. లింబన్న, ఎస్. కిశోర్, కే. ఆశిస్, ఎస్.బాల్ రాజ్, అనిస్ తదితరులు పాల్గొన్నారు.