జంగం అశోక్ సేవలు అభినందనీయం

బతుకమ్మ,వేల్పూర్ :-మండలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు జంగం అశోక్ గ్రామానికి అందించిన సేవలు అభినందనీయమని గ్రామస్తులు పొగిడారు. 35 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందించిన జంగం అశోక్ పదవీ విరమణ చేసిన సందర్భంగా సోమవారం జాన్కంపేట గ్రామంలో గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన స్నేహితులు గ్రామస్తులు మాట్లాడుతూ  ఆయన గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. చదువుతోనే భవిష్యత్తు ఉంటుందని అందరూ చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని ఎల్లప్పుడూ గ్రామస్తుల అభివృద్ధి కోరుకున్నాడని పేర్కొన్నారు. స్నేహితులతో కలిసి గ్రామంలో...