కార్యకర్తలను నాయకులుగా చేసేందుకు పుట్టిన పార్టీ జనసేన
. . . జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జనసేన పార్టీ కార్యకర్తలను నాయకులుగా చేసేందుకే పుట్టిన పార్టీ అని జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు వెల్లడించారు. జనసేన పార్టీ నిజామాబాద్, జహీరాబాద్ జిల్లాల సన్నాహక సమావేశం ఈ నెల 8న జిల్లా కేంద్రంలోని సుగుణ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...