ముషీరాబాద్ లో ఘనంగా జన సమితి ఆవిర్భావ వేడుకలు

  ముషీరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ జన సమితి ఎనిమిదేళ్లుగా జనం పక్షాన నిలబడి నిలదొక్కుకున్నదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం లోని రామ్ నగర్ గుండు, రాంనగర్ మీసేవ ప్రాంతాలలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడుతూ డబ్బు కేంద్రంగా ఉన్న ప్రస్తుత రాజకీయాలలో ప్రజల పక్షాన, ప్రజా సమస్యలపై అనునిత్యం గొంతు ఎత్తుతూ నిలబడిన పార్టీ జన సమితి...