Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 March 2025, 6:49 pm Posted by : ramakrishna

జన ఔషధి కేంద్రాల ద్వారా  పేదలకు ఎంతో మేలు

  • జన ఔషధి కేంద్రాల గురించి తగు ప్రచారం చేయండి
  •  డాక్టర్లను కోరిన ఎంపీ అర్వింద్

 

నిజామాబాద్, బతుకమ్మ  :  జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు అతి తక్కువ ధరలకు మందులు అందుతున్నాయని , దీని ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. 7వ జన ఔషధీ దివస్ సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ నగరంలోని నాందేమ్ వాడలో గల జన ఔషధీ కేంద్రాన్ని సందర్శించారు.  ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు అది తక్కువ ధరల్లో మందులు అందిస్తున్న  ప్రధాని మోడీకి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అనంతరం ఎంపీ అర్వింద్

Jan Aushadhi Kendras bring great benefits to the poor

మాట్లాడుతూ జన ఔషధీ కేంద్రాల ద్వారా అతి తక్కువ ధరలో లభిస్తున్న మందుల గురించి డాక్టర్లందరూ విరివిగా ప్రచారం చేయాలని కోరారు. నిజామాబాద్ నగరంలో నాలుగు జన ఔషధి కేంద్రాలు నడుపుతున్న నిర్వాహకుడు రితేష్ ని అభినందించారు. జిల్లాలో మరిన్ని జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తగిన సహాయం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వడ్డి మోహన్ రెడ్డి, నాగోల్ల లక్ష్మీనారాయణ, ఎర్రం సుధీర్, పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్, ఇప్పకాయల కిషోర్ , నిచ్చెంగ్ కృష్ణ, బస్సాపూర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Jan Aushadhi Kendras bring great benefits to the poor