మతసామరస్యానికి ప్రతీకగా జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్ ఈద్ మిలాప్ కార్యక్రమాలు

నిజామాబాద్ / ఆర్మూర్ / నందిపేట, బతుకమ్మ : పవిత్ర రమజాన్ మాసానంతరం వచ్చిన ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకొని జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నందిపేట, ఆర్మూర్ సహా పలు ప్రాంతాల్లో ఈద్ మిలాప్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించరు. మత సామరస్యం, శాంతి, ఐక్యతను చాటే  ఉద్దేశంతో నిర్వహించిన ఈ సభలు ప్రజల్లో మంచి సందేశాన్ని ఇచ్చాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతస్థుల మధ్య ఐక్యతకు ఈ సభలు ప్రతీకగా నిలిచాయని పలువురు ప్రశంసించారు. నందిపేటలో తాహెర్ బిన్ హమ్దాన్ ప్రసంగం... జమాఅత్-ఎ-ఇస్లామీ...