Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 5:37 pm Posted by : ramakrishna

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నిందితులపై విచారణ జరిపిన ఎల్లారెడ్డి జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.సుష్మ 4గురికి ఒక్కొక్కరికి ఒక రోజు జైలు శిక్ష, రూ.1100 జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.