Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2025, 6:37 pm Posted by : ramakrishna

నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు జైలు శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వన్ టౌన్ పరిధిలో మధ్య రాత్రి వ్యాపార సమయం దాటిన తర్వాత కూడా తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించిన ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు వన్ టౌన్ ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..  నగరంలోని వీక్లీ బజార్ లోని రెయిన్ బో బార్ యజమాని చింతకాయల రాజేందర్, బోదన్ రోడ్డులోని వైష్ణవి టిఫిన్ సెంటర్ యజమాని గుండె రాజు రాత్రి సమయంలో నిర్ణీత సమయం తర్వాత కూడా తమ వ్యాపారాలు కొనసాగించారు. దీంతో వీరిని అరెస్ట్ చేసి స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జీ ముందు హాజరు పరిచారు. జడ్జీ వీరికి ఒక రోజుల జైలు శిక్ష విధించారు. కోర్టు ఉత్తర్వుల నిమిత్తం వీరిని జైలుకు తరలించారు.

 

Jail sentence for traders who violate regulations