డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష
రుద్రూర్, బతుకమ్మ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడికి బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్పసాయి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు. రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా రాణంపల్లి గ్రామానికి చెందిన దేవరాజు గట్టు శివయ్య అనే వ్యక్తి పట్టుబడ్డారు. ఆ వ్యక్తిని గురువారం బోధన్ కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధించారని ఆయన తెలిపారు.