Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 4:55 pm Posted by : ramakrishna

భార్యను హింసించిన భర్తకు జైలుశిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : 

రెండవ పెళ్ళికోసం భార్యను శారీరకంగా, మానసికంగా హింసించిన భర్త ర్యాపని దేవదాస్ కు ఒక సంవత్సరం జైలుశిక్ష విధిస్తు నిజామాబాద్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వడ్డి హరి కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. నవీపేట్ పోలీసుల తరపున ప్రాసిక్యూషన్ నిర్వహించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భూసారపు రాజేష్ గౌడ్ తెలిపిన వివరాలు మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ కు చెందిన ర్యాపని దేవదాస్ కు, నవీపేట్ మండల కేంద్రంలోని రేఖకు సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. వీరికి శ్రావణ్,  శ్రావ్య పిల్లలున్నారు. కొన్ని సంవత్సరాలకు దేవదాసు ఒక మహిళతో అక్రమ సంబంధం ఏర్పడి ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని భార్య రేఖ ను శారీరక,మానసిక హింసలకు గురి చేసేవాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దేవదాసును రిమాండ్ కు తరలించారు పోలీసులు.  కోర్టు నేర న్యాయ విచారణలో పైన పేర్కొన్న నేరారోపణలు రుజువు కావడంతో దేవదాస్ కు ఒక సంవత్సరం జైలుశిక్ష తో పాటు ఐదు వేల రూపాయల జరిమాన విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలని తమ తీర్పు లో పేర్కొన్నారు.