మందుతాగి న్యూసెన్స్ చేసిన వ్యక్తికి జైలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన వ్యక్తికి న్యాయస్థానం ఏడు రోజుల జైలుశిక్ష విధించింది. నాల్గో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బోర్గాం గ్రామానికి చెందిన సంగి శ్రీధర్(25) మద్యం సేవించి తరచూ చుట్టుపక్కల వారితోపాటు కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీధర్ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజర్చగా న్యాయమూర్తి ఏడు రోజుల జైలు శిక్ష విధించారు.