Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 4:40 pm Posted by : ramakrishna

డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు, జరిమానా

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 30మందికి స్పెషల్ జుడిషియల్ రెండో క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ జైలు శిక్ష, జరిమానా విధించినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ డివిజన్ లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 30మందికి మంగళవారం కౌన్సిలంగ్ నిర్వహించిన కోర్టులో హాజరు పరిచారని తెలిపారు. వారిలో ఏడుగురికి జైలు శిక్ష, 23మందికి కలిపి రూ.2.36లక్షలు జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని సూచించారు. వాహనదారులు తమ వాహనలకు సబంధించిన పత్రాలను సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు.