Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 4:42 pm Posted by : ramakrishna

డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు, జరిమాన

నిజామాబాద్, బతుకమ్మ : మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి జైలు, 32మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 35మందికి ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ పి.ప్రసాద్ మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జాన్ ముందర హాజరుపరచారని తెలిపారు. అందులో 32 మందికి రూ.56500 జరిమానా, గౌతం నగర్ కు చెందిన గుండ్ల శ్రీనివాస్, కోటపల్లికి చెందిన కొమ్ము మధుకు 2 రోజుల జైలు శిక్ష, బోధన్ కు చెందిన సురేందర్ కు మూడు రోజులజైలు శిక్ష విధించినట్లు తెలిపారు.