నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అతిగా మద్యం తాగి వాహనం నడిపిన 26మందికి మంగళవారం ట్రాఫిక్ ఏసీపీ టి.నారాయణ ఆదేశానుసారం ట్రాఫిక్ ఎస్ఐ చంద్రమోహన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు హాజరుపరిచారు. వీరిలో 24మందికి రూ.36 వేల జరిమానా విధించారు. కర్నూల్ జిల్లాకు చెందిన ఆదినారాయణకు, భీంగల్ మండలానికి చెందిన ఈర్నాల సాయిలుకు రెండు రోజుల జైలు శిక్ష విధించారు.