Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 1:43 pm Posted by : ramakrishna

జై హనుమాన్

కాషాయవర్ణమైన ఇందూర్

హనుమాన్ విజయ యాత్ర ర్యాలీని ప్రారంభించిన ఎంపీ అరవింద్

జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగిన నగరం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నగరంలో హనుమాన్ యాత్ర ప్రారంభమైంది.. నగరంలోని శ్రీ నీలకంటేశ్వర ఆలయం వద్ద ఈ ర్యాలీ ప్రారంభం మై నది.. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ శనివారం మధ్యాహ్నం ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తతో పాటు హనుమాన్ భక్తులు , హనుమద్దీక్ష స్వాములు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హనుమాన్ విజయాత్ర ర్యాలీ సందర్భంగా నగరం కాషాయవర్ణమైంది. కాషాయద్వజాలను ధరించిన దీక్ష స్వాములు, భక్తులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు… శ్రీరాముని, ఆంజనేయస్వామి ప్రతిమలతో రథం వెంటరాగా నగరంలోని నాల్కల్ చౌరస్తాలో గల హనుమాన్ మందిరం వరకు ర్యాలీ సాగింది..నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి ఇతర అధికారులు బందోబస్తు కార్యక్రమంలో స్వయంగా పర్యవేక్షించారు. నగరంలో హనుమాన్ విజయ యాత్ర జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా నగరంలో జరిగే హనుమాన్ విజయాత్ర కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్య ఆత్మక ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. విజయ యాత్ర జరిగే ప్రాంతాలను ట్రాఫిక్ రద్దీని పురస్కరించుకొని వాహనాలను దారి మళ్లించారు. పలు ప్రాంతాల్లో దుకాణ సముదాయాలను మూసి వేయించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో 1300 మంది పోలీసులతో బందోబస్తు పర్యవేక్షిస్తున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.

Jai Hanuman

Jai Hanuman